తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాస హోమ మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి, నవంబర్ 11, 2026: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక హోమ మహోత్సవాలు…

✍ Admin · 📅 12 Nov 2026 · ⏱ 1 min read · 👁 895
Karthika Masam Homa Mahotsavams Begin at Tirupati Kapileswara Swamy Temple

తిరుపతి, నవంబర్ 11, 2026: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక హోమ మహోత్సవాలు బుధవారం గణపతి హోమంతో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

పంచమూర్తులకు స్నపన తిరుమంజనం, గణపతి హోమం

బుధవారం ఉదయం పంచమూర్తులకు ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

సాయంత్రం వివిధ పూజా కార్యక్రమాల అనంతరం గణపతి హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. దీంతో నెల రోజుల హోమ మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

నవంబర్ 12, 13 తేదీల్లో సుబ్రహ్మణ్యస్వామి హోమం

కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 12, 13 తేదీల్లో సుబ్రహ్మణ్యస్వామి హోమం నిర్వహించనున్నారు.

పవిత్ర కార్తీక మాసంలో ఆలయంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అధికారులు

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
🙏 ఈ వార్త మీకు నచ్చిందా? మీ కుటుంబ WhatsApp గ్రూపులో పంచుకోండి — శ్రీవారి కృప మరిన్ని భక్తులకు చేరనివ్వండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy