తిరుపతి, నవంబర్ 25, 2026: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 5, 2026న కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లడం, స్నపన తిరుమంజనం, వనభోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీవారి మెట్టు సమీపంలోని పారువేట మండపానికి ఊరేగింపు
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు, అమ్మవారి ఉత్సవమూర్తులను ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి మెట్టు సమీపంలోని పారువేట మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.
స్నపన తిరుమంజనం, వనభోజనం
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపుతో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
అనంతరం ప్రత్యేక అలంకరణలు, వనభోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
సాయంత్రం 5 గంటలకు ఉత్సవమూర్తులు తిరిగి ఆలయానికి చేరుకోనున్నారు.
డిసెంబర్ 5న నిత్య కల్యాణోత్సవ ఆర్జిత సేవ రద్దు
కార్తీక వనభోజన మహోత్సవం సందర్భంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 5న నిత్య కల్యాణోత్సవ ఆర్జిత సేవ రద్దు చేయనున్నారు.
💬 వ్యాఖ్యలు