అలిపిరి కాలిబాట మార్గంలో టీటీడీ అదనపు ఈవో తనిఖీ – భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు

తిరుమల, నవంబర్ 12, 2026: తిరుమలకు వెళ్లే అలిపిరి కాలిబాట మార్గంలో మాధవ నిలయం (పీఏసీ-2) నుంచి జీఎన్‌సీ టోల్ గేట్ వరకు ఉన్న పాదచారుల మార్గాన్ని టీటీడీ అదనపు…

✍ Admin · 📅 13 Nov 2026 · ⏱ 1 min read · 👁 948

తిరుమల, నవంబర్ 12, 2026: తిరుమలకు వెళ్లే అలిపిరి కాలిబాట మార్గంలో మాధవ నిలయం (పీఏసీ-2) నుంచి జీఎన్‌సీ టోల్ గేట్ వరకు ఉన్న పాదచారుల మార్గాన్ని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ చ. వెంకయ్య చౌదరి గురువారం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మార్గమధ్యంలో దర్శనం, ఉచిత వసతి సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనులపై కూడా అధికారులతో చర్చించారు.

అలిపిరి కాలిబాట మార్గంలోని దుకాణాలకు సూచనలు

కాలిబాట మార్గంలోని దుకాణాలను తనిఖీ చేసిన అదనపు ఈవో, తాగునీరు మరియు ఆహార పదార్థాలను నిర్ణీత ధరలకే విక్రయించాలని దుకాణదారులను ఆదేశించారు.

అలాగే, కాలిబాట మార్గంలో ఎలాంటి ఆక్రమణలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

తనిఖీలో పాల్గొన్న అధికారులు

ఈ తనిఖీలో ఎస్ఈ-2 శ్రీ వేణుగోపాల్, డిప్యూటీ ఈవోలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ సోమనారాయణ, డీఈ శ్రీ చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
✨ దైవ సమాచారాన్ని విస్తరించడంలో సహాయపడండి — తెలుసుకోవాలనే వారికి పంచుకోండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy